తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులకు తప్పిన ప్రమాదం
- రెండో ఘాట్ రోడ్డుపై ప్రమాదానికి గురైన బస్సు
- రక్షణ గోడ ఎక్కి చెట్టును ఢీకొని ఆగిపోయిన బస్సు
- సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
తిరుమల ఘాట్ రోడ్డులో నేడు భక్తులకు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న రక్షణ గోడ ఎక్కి, చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. బస్సు అంతటితో ఆగిపోవడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పినట్టయింది. లోయలో పడి ఉంటే తీవ్ర నష్టం జరిగి ఉండేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రేక్ ఫెయిల్ కాగా, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో భక్తులు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు భక్తులను మరో వాహనంలో తిరుమల కొండపైకి పంపించారు. ప్రమాదం కారణంగా రెండో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, అధికారులు ట్రాఫిక్ ను చక్కదిద్దే చర్యలు చేపట్టారు. రెండో ఘాట్ రోడ్డులోని వినాయక మందిరం వద్ద ఈ ఘటన జరిగింది.