జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో పూజలకు సుప్రీంకోర్టు అనుమతి!
- జ్ఞానవాపి మసీదు దక్షిణ వైపు సెల్లార్‌లో పూజలపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
- మసీదు సెల్లార్‌లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ పిటిషన్ తిరస్కరణ
- దక్షిణ వైపు సెల్లార్‌లో పూజలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. జ్ఞానవాపి మసీదు దక్షిణ వైపు సెల్లార్‌లో పూజలు చేయడాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే, హిందువులు చేసే పూజలు మసీదు దక్షిణ వైపు ఉన్న సెల్లార్ ప్రాంతానికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునే అంశంలో మాత్రం ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు వెల్లడించింది.
ఇక మసీదు సెల్లార్‌లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ పిటిషన్‌ను ఫైనల్‌గా జులైలో విచారిస్తామని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా, మసీదు సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకోవచ్చని గతంలో వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సైతం ధ్రువీకరించిన విషయం తెలిసిందే.