కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించింది నేనే... వచ్చే ఎన్నికల్లో ఓడించేది నేనే: ఎర్రబెల్లి దయాకరరావు
- కడియం శ్రీహరికి పార్టీలో ఏం తక్కువ చేశారని ప్రశ్నించిన ఎర్రబెల్లి
- ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ అని వ్యాఖ్య
- కడియంకు పదవులు రావడం కోసం ఎంతగానో కృషి చేశానన్న ఎర్రబెల్లి దయాకర రావు
కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించింది తానేనని... క్యాస్ట్ ఈక్వేషన్‌లో తనకు మంత్రి పదవి రాదంటే కడియంకు ఇవ్వాలని చెప్పింది కూడా తానేనని... రేపు ఆయనను ఓడగొట్టే వారిలోనూ తానే ముందు ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. సోమవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... కడియం శ్రీహరికి పార్టీలో ఏం తక్కువ చేశారని వెళ్లిపోయారు? అంటూ మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ అన్నారు. ఆయనకు పదవులు రావడం కోసం తాను ఎంతగానో కృషి చేశానన్నారు.
ఎన్నో అవకాశాలు కల్పించిన తల్లిలాంటి పార్టీకి బిడ్డ కోసం తీవ్ర ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిందిపోయి స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరడం ఆయన వక్రబుద్ధికి నిదర్శనం అన్నారు. ప్రతి ఎన్నికల్లో కడియం శ్రీహరి గెలుపునకు కృషి చేశానన్నారు. వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓటమే లక్ష్యంగా తాను పని చేస్తానన్నారు. ఇలాంటి అవకాశవాదులకు ప్రజలు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.