ఉబెర్ ఆటో చార్జ్ రూ. 62.. వెయిటింగ్ చార్జ్ రూ. 6 కోట్లు.. వీడియో ఇదిగో!

  • ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఘటన
  • ఆటో బుక్ చేసుకున్న సమయంలో రూ. 62గా చూపించిన రైడ్ చార్జ్
  • గమ్యానికి చేరుకున్నాక రూ.7.66 కోట్లుగా మొత్తం బిల్
  • ప్రమోషన్ కాస్ట్ కింద రూ. 75 తగ్గింపు
  • కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
పనిమీద బయటకు వెళ్లేందుకు ఉబెర్ ఆటో బుక్‌ చేసుకున్న నోయిడా వాసికి దారుణ అనుభవం ఎదురైంది. ఢిల్లీ సమీపంలోని నోయిడాకు చెందిన దీపక్ టెంగూరియా బయటకు వెళ్లేందుకు ఉబెర్‌లో ఆటోను బుక్ చేసుకున్నాడు. ఆ సమయంలో బిల్ రూ. 62గా చూపించింది. అక్కడి వరకు బాగానే ఉన్నా.. గమ్యస్థానం చేరిన తర్వాత బిల్ చూస్తే ఏకంగా రూ. 7,66,83,762 కోట్లు కనిపించింది. దీంతో దీపక్ కాసేపు షాక్‌లోకి వెళ్లిపోయాడు. 

బిల్లును వీడియో తీసిన దీపక్ స్నేహితుడు ఆశిష్ మిశ్రా దానిని ‘ఎక్స్’లో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఇక, ఉబెర్ పంపిన బిల్లులో రైడ్ చార్జీగా రూ.  1,67,74,647, వెయిటింగ్ చార్జీ కింద రూ. 5,9909,189 పేర్కొంది. అంతేకాదు, ఈ మొత్తంలో ప్రమోషన్ కింద రూ. 75 తగ్గించడం విశేషం. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉబెర్ స్పందించింది. దీపక్‌కు క్షమాపణ చెప్పింది. బిల్లు ఎందుకలా వచ్చిందో చూసి, సవరిస్తామని పేర్కొంది. 

వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. చంద్రయాన్ నుంచి ఆటోను బుక్ చేసుకున్నా ఇంత చార్జ్ అవదని కామెంట్ చేస్తున్నారు. 


More Telugu News