అయోధ్య రామయ్య భక్తులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు
- వెల్లడించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులోకి
- విమానాలు నడపనున్న స్పైస్‌జెట్
- ప్రయాణ సమయం 2 గంటలు
అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్ ద్వారా వెల్లడించారు.
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రెండు గంటల్లోనే చేర్చనుంది. మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ నుంచి విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. అవే రోజుల్లో మధ్యాహ్నం 1.25 గంటలకు అయోధ్యలో బయలుదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం హైదరాబాద్ చేరుకుంటుంది.