మీరు నా కంటే ఫాస్ట్... 'వివేకం' సినిమాపై చంద్రబాబు స్పందన
- వివేకానందరెడ్డి జీవితకథ ఆధారంగా వివేకం
- యూట్యూబ్ లో రిలీజ్
- ప్యాలెస్ గుట్టు తెలిసిందా అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
వైఎస్ వివేకానందరెడ్డి జీవితగాథపై రూపొందించిన 'వివేకం' అనే చిత్రం యూట్యూబ్ లో రిలీజైంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ... "ఇవాళ పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. 'వివేకం' అని ఎవరో ఒక సినిమా తీశారు. ఆ సినిమా చూడండి మీరు. మీలో ఆ సినిమా ఎంత మంది చూశారు? ప్యాలెస్ గుట్టు తెలిసిందా? మీరు నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు... మీకన్నీ తెలుసు తమ్ముళ్లూ... కానీ ముందుకు రారు" అని వ్యాఖ్యానించారు.
ఇక, తన ప్రసంగం ముగించిన అనంతరం చంద్రబాబు... సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ డీజే బాక్సుల్లోంచి వస్తున్న పాటకు అనుగుణంగా చేతులు ఊపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
వివేకా బయోపిక్ గా తెరకెక్కిన వివేకం చిత్రానికి యూట్యూబ్ లో తొలిరోజే మిలియన్ వ్యూస్ లభించాయి. టీమ్ ఎస్ క్యూబ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది.