వెధవల్లారా... మీకు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్పాను: చంద్రబాబు
- నేడు మూడు జిల్లాల్లో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభకు హాజరైన టీడీపీ అధినేత
- బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు తప్పుడు వార్తలు చేరవేస్తున్నారని ఆరోపించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే మాయగాళ్లు వచ్చారని అన్నారు. వెధవల్లారా... మీకు సిగ్గులేదు... ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్పానని, కానీ ఫేక్ వార్తలతో అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, చంద్రబాబు ఇవాళ కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ప్రజాగళం యాత్ర చేపడుతున్నారు. ఎమ్మిగనూరు సభ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురం (క్లాక్ టవర్ సెంటర్)లో సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బాపట్ల జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద ప్రజాగళం సభ జరగనుంది.