మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్‌పై కేసు నమోదు
- నిన్న భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న సీతారాంనాయక్
- మూలవిరాట్ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అనుచరులు
- తీవ్రంగా పరిగణించి పోలీసులకు ఫిర్యాదుచేసిన ఈవో రమాదేవి
భద్రాద్రి రామయ్య మూల విరాట్ ఫొటోలు తీశారంటూ మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌పై భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీతారాంనాయక్ నిన్న సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు నిబంధనలకు విరుద్ధంగా స్వామివారి మూలవిరాట్ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మూలవిరాట్ ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఆలయ ఈవో రమాదేవి దీనిని తీవ్రంగా పరిగణించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతారాంనాయక్‌పై కేసు నమోదుచేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
మూలవిరాట్ ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఆలయ ఈవో రమాదేవి దీనిని తీవ్రంగా పరిగణించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతారాంనాయక్‌పై కేసు నమోదుచేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.