జగన్ సినిమాల్లోకి వస్తే ఆస్కార్, భాస్కర్ అవార్డులు ఆయనకే: లోకేశ్
- తాడేపల్లి అపార్ట్‌మెంట్ వాసులతో లోకేశ్ సమావేశం
- కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని లోకేశ్ హామీ
- జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో 9సార్లు విద్యుత్తు చార్జీలు పెంచిందని ఆగ్రహం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వస్తే ఆస్కార్, భాస్కర్ అవార్డులు అన్నీ ఆయనకే దక్కుతాయని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని హత్యచేసి ఆ నెపాన్ని కుటుంబ సభ్యులపైకి నెట్టిన మహానటుడు జగన్ అని విమర్శించారు. ఈ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీలో స్థానికులతో లోకేశ్ సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామన్నారు. జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో 9సార్లు విద్యుత్తు చార్జీలను పెంచిందని మండిపడ్డారు. ఇంటిపన్ను, గ్యాస్,పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.