చెప్పు విసరడం భావ ప్రకటన స్వేచ్ఛే.. నాటి డీజీపీ గౌతం సవాంగ్ వ్యాఖ్యల వీడియో వైరల్

  • గతంలో చంద్రబాబుపై దాడి జరిగితే భావ ప్రకటన స్వేచ్ఛ అని వ్యాఖ్యానించిన గౌతం సవాంగ్
  • ఆ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • జగన్‌పై చెప్పు విసిరడం కూడా భావప్రకటన స్వేచ్చేనంటూ నెటిజన్ల కామెంట్
గతంలో రాజధాని గ్రామాల్లో పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వాహనంపై కొందరు దుండగులు కర్రలు, చెప్పులు విసిరారు. జడ్‌ప్లస్ కేటగిరీ ఉన్న చంద్రబాబుపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అప్పటి డీజీపీ గౌతం సవాంగ్.. అది దాడి కాదని, వారి భావ ప్రకటన స్వేచ్ఛ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 

ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని గుత్తిలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చెప్పు విసిరారు. ఈ నేపథ్యంలో గతంలో గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై చెప్పు విసరడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందికే వస్తుందని భాష్యం చెబుతున్నారు.


More Telugu News