నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత కల్పిస్పూ కేంద్రం నిర్ణయం

  • లోకేశ్ యువగళం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టుల హెచ్చరికలు, నిఘావర్గాల సమాచారం ఆధారంగా నిర్ణయం
  • సీఆర్పీఎఫ్‌ వీఐపీ వింగ్‌ భద్రతా సిబ్బందితో జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ
  • 3 షిఫ్టుల్లో పనిచేయనున్న 22 మంది సిబ్బంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టుల హెచ్చరికలు, నిఘావర్గాల సమాచారం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై లోకేశ్‌కు సీఆర్పీఎఫ్‌ (వీఐపీ వింగ్‌) భద్రతా సిబ్బందితో జెడ్‌ కేటగిరీ భద్రతను అందివ్వనున్నారు. వీరిలో నలుగురైదుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు ఉంటారు. మొత్తం 22 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటలపాటు లోకేశ్‌కు భద్రత కల్పించనున్నారు.

కాగా వైసీపీ ప్రభుత్వం తనకు సెక్యూరిటీ తగ్గించిందని లోకేశ్‌ పలుమార్లు విమర్శించారు. తనకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌, హోంశాఖలకు లేఖలు కూడా రాసిన విషయం తెలిసిందే. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో లోకేశ్‌కు భద్రత కల్పించింది.


More Telugu News