వేసవిలో కరెంట్, తాగునీటి సమస్య ఉండొద్దు: సీఎం రేవంత్ రెడ్డి
- డిమాండ్‌కు తగ్గట్టుగా అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి
- అలాగే తాగునీటి కొరత లేకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సూచన
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వాటర్ ట్యాంకులు సిద్ధంగా ఉంచాలన్న సీఎం రేవంత్
- తాగునీటి సమస్య రాకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలంటూ స్పష్టీకరణ
వేసవిలో కరెంట్, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని ఆదేశించారు. డిమాండ్‌కు తగ్గట్టుగా అంతరాయం లేకుండా కరెంటు సరఫరా ఉండాలని, దానికోసం ముందే ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.
ఇంకా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి. జూన్ వరకు బోర్లు, బావులు, ఇతర స్థానిక నీటి వనరులు వాడుకోవాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వాటర్ ట్యాంకులు సిద్ధంగా ఉండాలి. ట్యాంకర్లు బుక్ చేస్తే 12 గంటల్లోపు చేరేలా చూడాలి. తాగునీటి సమస్య రాకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గ్రామాల వారీగా కార్యాచరణ తయారు చేసి, పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలి" అని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.