అర్ధ‌శ‌త‌కంతో రాణించిన క్వింట‌న్‌ డికాక్‌.. పంజాబ్ ముందు భారీ టార్గెట్..!

  • ల‌క్నోలో ఎల్ఎస్‌జీ వర్సెస్ పీబీఎస్‌కే మ్యాచ్‌
  • మొద‌ట బ్యాటింగ్‌కు దిగి 20 ఓవ‌ర్ల‌లో 199 ప‌రుగులు చేసిన‌ ల‌క్నో
  • పంజాబ్ ముందు 200 ప‌రుగుల భారీ ల‌క్ష్యం
  • ల‌క్నో బ్యాట‌ర్ల‌లో రాణించిన డికాక్ (54), కృనాల్ పాండ్యా (43), నికోల‌స్ పూర‌న్ (42)   
  • పంజాబ్ బౌల‌ర్ల‌లో సామ్ కర్రన్ 3, అర్షదీప్ సింగ్ 2, క‌సిగో ర‌బాడ, రాహుల్ చాహార్‌ల‌కు త‌లో వికెట్  
ఐపీఎల్‌లో భాగంగా నేడు ల‌క్నో వేదిక‌గా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) త‌ల‌ప‌డుతున్నాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 200 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. లక్నో బ్యాట‌ర్ల‌లో క్వింట‌న్‌ డికాక్ హాఫ్ సెంచ‌రీ (54) తో రాణించాడు. 38 బంతులు ఎదుర్కొన్న డికాక్ 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 54 ప‌రుగులు చేశాడు. 

డికాక్‌కు తోడుగా కృనాల్ పాండ్యా, కెప్టెన్ నికోల‌స్ పూర‌న్ కూడా చెల‌రేగారు. కృనాల్ 22 బంతుల్లోనే 43 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 4 బౌండ‌రీలు, 2 సిక్సులు ఉన్నాయి. ఇక పూర‌న్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 42 ప‌రుగులు చేశాడు. కేఎల్ రాహుల్ (15) మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో సామ్ కర్రన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్షదీప్ సింగ్ 2, క‌సిగో ర‌బాడ, రాహుల్ చాహార్ త‌లో వికెట్ తీశారు.


More Telugu News