బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు
- 27 మంది సభ్యులతో మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ
- కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- కమిటీలోని సభ్యులుగా మంత్రులు అశ్వినీ వైష్ణవ్, స్మృతీ ఇరానీ, రవిశంకర్ ప్రసాద్
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న బీజేపీ తమ మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా శనివారం మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో-కన్వీనర్‌గా మరో కేంద్రమంత్రి పీయుష్ గోయల్‌ను నియమించింది. మొత్తం 27 మంది సభ్యులతో కూడిన ఈ ప్రత్యేక కమిటీని శనివారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ కమిటీలోని ఇతర సభ్యులలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, స్మృతీ ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, అర్జున్ రామ్ మెఘ్వాల్ తదితరులు ఉన్నారు.