పండుటాకులు రాలిపోతున్నాయి.. పార్టీని వీడుతున్నవారిపై బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు
- పోయేటోళ్లు ఎందుకు పోతున్నారో ప్రజలకు బాగా తెలుసన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకుంటామని ధీమా
- కేసీఆర్ ముందు వాళ్లెంత? వాళ్ల లెక్కంత అని తీసిపడేసిన జగదీశ్‌రెడ్డి
బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండడంపై ఆ పార్టీ నేత, మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోయేవాళ్లందరూ ఎండుటాకుల్లాంటివారని వ్యాఖ్యానించారు. పోయినా పార్టీకి నష్టం లేదని, కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకుంటామని పేర్కొన్నారు. పార్టీ మారేందుకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెబుతారని, వారు ఇప్పుడు ఏం చెప్పినా, పోయేటోళ్లు ఎందుకు పోతున్నారో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. చెట్టుకు పండుటాకులు రాలిపోయిన తర్వాత కొత్త ఆకులు వచ్చినట్టే కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి వంటివాళ్లనే ఎదుర్కొని వచ్చామన్న జగదీశ్‌రెడ్డి.. కేసీఆర్ ముందు వీళ్లెంత.. వీళ్ల లెక్కంత? అని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారంతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని, అందుకే పార్టీ మారుతున్నామన్న కడియం శ్రీహరి కావ్య వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాకే వారు పార్టీలో అభ్యర్థిత్వం ప్రకటించుకున్నారని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు.