సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి
- ముఖ్యమంత్రి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నం
- అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అతను ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ముఖ్యమంత్రి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అతను ఈ చర్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతనిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.