రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్
- ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ కు దూరమవుతున్న నేతలు
- నిన్న రేవంత్ తో భేటీ అయిన కేకే
- కాంగ్రెస్ లో చేరబోతున్న కడియం శ్రీహరి
బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా ఈరోజు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కాంగ్రెస్ గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వీరిద్దరికీ రేవంత్, దీపాదాస్ మున్షీ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.
విజయలక్ష్మి తండ్రి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన నిన్న రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే ప్రారంభమయిందని, నాలుగు దశాబ్దాల పాటు తాను కాంగ్రెస్ లో ఉన్నానని, కాంగ్రెస్ లోనే చస్తానని నిన్న ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాసేపట్లో కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య రేవంత్ ను కలిసే అవకాశం ఉంది.