పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. కాజీపేటలో గంటన్నరపాటు నిలిచిపోయిన రైలు
- స్టేషన్ ఘన్‌పూర్ వద్ద బీ4 కోచ్‌లో మొదలైన పొగలు
- నెమ్మదిగా కాజీపేట వరకు తీసుకెళ్లి నిలిపివేత
- బ్యాటరీ క్యాప్‌లో లీకేజీ కారణంగానే పొగలు
- మరమ్మతు అనంతరం రాత్రి 10 గంటలకు బయలుదేరిన రైలు
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. నిన్న సాయంత్రం సికింద్రాబాద్‌లో రైలు బయలుదేరింది. స్టేషన్‌ఘన్‌పూర్ దాటిన తర్వాత బీ4 కోచ్‌లో పొగలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు.
వెంటనే సిబ్బందికి సమాచారం అందించడంతో రైలును నెమ్మదిగా కాజీపేట తీసుకొచ్చి నిలిపివేశారు. బ్యాటరీ క్యాప్ లీక్ కావడంతోనే పొగలు వచ్చినట్టు గుర్తించారు. మరమ్మతుల అనంతరం రాత్రి 10 గంటలకు రైలు బయలుదేరింది. ఈ కారణంగా కాజీపేటలో రైలు దాదాపు గంటన్నరపాటు నిలిచిపోయింది.