తమిళ సినీనటుడు డానియెల్ బాలాజీ గుండెపోటుతో మృతి
- డానియెల్ బాలాజీకి శుక్రవారం గుండెపోటు
- చెన్నైలోని ఆసుపత్రిలో మృతి
- బాలాజీ వయసు 48 ఏళ్లు
ప్రముఖ తమిళ సినీ నటుడు డానియెల్ బాలాజీ 48 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందారు. చెన్నైలో శుక్రవారం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా ఆ రాత్రి మృతి చెందారు. డానియెల్ బాలాజీ ఆకస్మిక మరణంతో తమిళ సినీరంగం దుఃఖంలో కూరుకుపోయింది.
కమల్ హసన్ చిత్రం ‘మరుదునయగమ్’తో ప్రొడక్షన్ మేనేజర్‌గా డేనియల్ బాలాజీ తన కెరీర్ ప్రారంభించాడు. అయితే, ఆ చిత్ర నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. అనంతరం, రాధిక శరత్‌కుమార్ ‘ఛిత్తీ’ టీవీ సీరియల్‌లో డానియెల్ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో, డానియెల్ బాలాజీగా ఆయన పాప్యులర్ అయ్యారు. ఆయన పలు తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించారు.