కేశవరావు, కడియం శ్రీహరిలపై దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం
- అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి... పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్లడం ఏమిటి? అని ప్రశ్న
- ఏమాత్రం ఇంగితం ఉన్నా పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్
- ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే అనర్హత పడుతుందని హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, చేరాలని నిర్ణయించుకున్న కె.కేశవరావు, కడియం శ్రీహరిలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ అనుభవించి... పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్లడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఏమాత్రం ఇంగితం ఉన్నా పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీని వీడుతున్న వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బుగ్గ కార్లలో తిరిగి పదేళ్లు అధికారంతో వచ్చిన హోదాను, డబ్బును, అధికారాన్ని వాడుకొని పార్టీ మారుతారా? అని ప్రశ్నించారు.
దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా ఎలా పోటీ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే అనర్హత వేటు పడుతుందన్నారు. ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం ఎలా కుదురుతుందో చెప్పాలన్నారు. అలాంటి వారు మునిగిపోక తప్పదన్నారు.
కేసీఆర్ తనకు దేవుడిలాంటి వాడని దానం నాగేందర్ అన్నారని... అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు తిట్టారన్నారు. ఎవరైనా దేవుడి వద్ద ఉంటారా? తిట్టిన వారి వద్దకు వెళతారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌లోకి వచ్చారని... బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళుతున్నారన్నారు. కొందరు ఆత్మగౌరవం అంటున్నారని... పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు అది గుర్తుకు రాలేదా? అని నిలదీశారు.