హైదరాబాద్ లో రాత్రివేళ ఆకతాయిల 'బైక్ స్టంట్స్'తో జనాలకు ఇక్కట్లు.. ఇదిగో వీడియో!
- చీకటి పడటమే ఆలస్యం రోడ్లపై బైక్స్‌తో ప్రత్యక్షం అవుతున్న పోకిరీలు
- ప్రమాదకర బైక్ విన్యాసాలతో జనాలను హడలెత్తిస్తున్న వైనం
- రాజేంద్రనగర్ పరిధిలో రాత్రివేళ రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తూ కనిపించిన కొందరు ఆకతాయిలు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
ఇదివరకు నగర శివారులలో నిర్వహించే బైక్ స్టంట్స్.. ఇప్పుడు ఏకంగా నగర రోడ్లపైకి వచ్చేశాయి. అది కూడా రద్దీగా ఉండే రోడ్లపై ఇలా ఆకతాయిలు ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేస్తూ తోటి వాహనదారులను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. చీకటి పడటమే ఆలస్యం.. రోడ్లపై బైక్స్‌తో ప్రత్యక్షం అవుతున్నారు ఆకతాయిలు. విచ్చల విడిగా ప్రమాదకర విన్యాసాలతో జనాలను హడలెత్తిస్తున్నారు. ఇదే కోవలో తాజాగా రాజేంద్ర నగర్ పరిధిలో కొందరు యువకులు రాత్రివేళ రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తూ కనిపించారు. ఆ ఆకతాయిల బైక్ స్టంట్స్ తాలూకు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పక్కన వేరే వాహనాలు వెళ్తున్నప్పటికీ వారు అవేమీ పట్టించుకోకుండా బైక్ విన్యాసాలు చేయడం మనం వీడియోలలో చూడొచ్చు.
అత్తాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 140 నుంచి 170 వరకు ఇలా బైక్స్‌పై డేంజరస్ స్టంట్స్ చేస్తూ పోకిరీలు హల్‌చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ 'ఎక్స్' (ట్విటర్) లో పంచుకున్నారు. అలాగే ట్విట్టర్ వేదికగానే తెలంగాణ డీజీపీతో పాటు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక వీడియోలు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.