కేసీఆర్ మాట నిటబెట్టుకోలేదు: కేశవరావు

  • బీఆర్ఎస్ ను ఒక కుటుంబం నడిపిస్తోందనే భావన ఉందన్న కేకే
  • కొన్ని పొరపాట్ల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని వ్యాఖ్య
  • తనకు బీఆర్ఎస్, కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోలేనన్న కేకే
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కేకే కలిశారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ సమక్షంలో కేకే కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీని ఒక కుటుంబం నడిపిస్తోందనే భావన ప్రజల్లో ఉందని చెప్పారు. ఏ పార్టీ అయినా క్యాడర్ ను దూరం చేసుకోకూడదని అన్నారు. సరిచేసుకోవాల్సిన తప్పులను బీఆర్ఎస్ సరిచేసుకోలేదని అన్నారు. కొన్ని పొరపాట్ల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారని... ఆ మాట నిలబెట్టుకోలేదని అన్నారు. తనకు బీఆర్ఎస్, కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోలేనని చెప్పారు. ఇండియాలో కాంగ్రెస్ పార్టీనే గొప్ప పార్టీ అని అన్నారు.


More Telugu News