కోడుమూరు చేరుకున్న జగన్ బస్సు యాత్ర.. ఈరోజు రూట్ మ్యాప్ ఇదిగో!
- మూడో రోజుకు చేరిన జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర
- మధ్యాహ్నం ఎమ్మిగనూరులో బహిరంగ సభ
- జగన్ వెంట ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేబట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పెంచికలపాడు నుంచి మూడో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. మూడో రోజు బస్సు యాత్ర సందర్భంగా జగన్ ఎక్స్ వేదికగా... 'కర్నూలు జిల్లా సిద్ధమా?' అని ట్వీట్ చేశారు. కాసేపటి క్రితం బస్సుయాత్ర కోడుమూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ ను వైసీపీ శ్రేణులు గజమాలతో సత్కరించాయి. జగన్ కు సంఘీభావంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు.
జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్ ఖాన్, జరదొడ్డి సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు. ఈనాటి బస్సు యాత్రలో ఎమ్మిగనూరులో బహిరంగ సభను నిర్వహించనున్నారు. పత్తికొండ దగ్గర కేజీఎన్ ఫంక్షన్ హాల్లో రాత్రికి జగన్ బస చేస్తారు. మూడో రోజు యాత్ర పెంచికలపాడు, రామచంద్రాపురం, కోడుమూరు, హంద్రీ కైరవాడి, గోనెగండ్ల, రాళ్లదొడ్డి, ఎమ్మిగనూరు, అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బినిగేరే, ఆస్పరి, చిన్న హుల్తి మీదుగా కొనసాగుతుంది.