ఐపీఎల్: రాజస్థాన్ రాయల్స్ తో పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- జైపూర్ లో ఐపీఎల్ మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
- ఢిల్లీ జట్టులో ఆన్రిచ్ నోక్యా, ముఖేశ్ కుమార్ లకు స్థానం
- మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో, నేడు రాజస్థాన్ తో మ్యాచ్ ఢిల్లీ జట్టుకు కీలకంగా మారింది.
అటు, రాజస్థాన్ జట్టు విజయంతో టోర్నీలో శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్... లక్నో సూపర్ జెయింట్స్ పై నెగ్గింది. ఇవాళ ఢిల్లీ జట్టుపైనా గెలిచి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ వెల్లడించాడు.
అదే సమయంలో ఢిల్లీ జట్టులో రెండు మార్పులు జరిగాయి. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఇంకా కోలుకోలేదని, షాయ్ హోప్ వీపు నొప్పితో బాధపడుతున్నాడని కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు. వారిద్దరి స్థానంలో ఆన్రిచ్ నోక్యా, ముఖేశ్ కుమార్ ఆడుతున్నారని వివరించాడు.
ఇరు జట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కెప్టెన్ సంజూ శాంసన్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ట్రిస్టాన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.