ఫామ్ హౌస్‌కు వచ్చిన కేశవరావుపై కేసీఆర్ తీవ్ర అసహనం?

  • పార్టీలో మీకు, కూతురుకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పార్టీని ఎందుకు వీడుతున్నారంటూ కేసీఆర్ నిలదీత
  • అధికారం పోగానే పార్టీని వీడుతున్నారని ఆవేదన
  • కేకేతో పాటు పార్టీ వీడుతున్న పలువురు నేతలపై కేసీఆర్ తీవ్ర అసహనం
బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావుపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కేకే పార్టీ మారనున్నట్లుగా కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లారు. తన కుటుంబం పార్టీ మారనున్నట్లు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారని, ఈ సమయంలో కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు.

మీడియా కథనాల మేరకు... పార్టీలో కేకేకు, ఆయన కూతురుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పార్టీని ఎందుకు వీడుతున్నారంటూ కేసీఆర్ నిలదీశారు. పదేళ్ల పాటు పదవులు అనుభవించి ఇప్పుడు అధికారం పోగానే పార్టీని వీడుతున్నారని వాపోయారు. కేకేతో పాటు పార్టీ వీడుతున్న పలువురు ప్రజాప్రతినిధులు, నేతలపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారడానికి గల కారణం కేకే చెబుతుండగా... సాకులు చెప్పవద్దని కేసీఆర్ సూచించినట్టు సనాచారం. దీంతో కేశవరావు మధ్యలోనే బయటకు వచ్చేసినట్టు చెబుతున్నారు.


More Telugu News