టాలీవుడ్ టాప్ త్రీ హీరోయిన్స్ పరిస్థితి ఇదే!
- 'ఆచార్య' తరువాత కనిపించని పూజ హెగ్డే
- 'పుష్ప' స్థాయి హిట్ చూడలేకపోయిన రష్మిక
- 'దసరా' తరువాత హీరోయిన్ గా కనిపించని కీర్తి సురేశ్
- టాప్ త్రీ పొజీషన్స్ పట్ల అభిమానుల ఆసక్తి
తెలుగులో టాప్ త్రీ హీరోయిన్స్ అనగానే పూజ హెగ్డే .. రష్మిక మందన .. కీర్తి సురేశ్ కనిపిస్తారు. కొంతకాలంగా ఈ ముగ్గురే ఈ స్థానాలను ఏలుతున్నారు. ఎప్పటిలానే చాలామంది కొత్త కథానాయికలు వస్తున్నారు. కానీ వాళ్లంతా కూడా వీరి దరిదాపులకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వీళ్లు తమ స్టార్ హీరోలతో సందడి చేస్తూ వచ్చారు. కీర్తి సురేశ్ తమిళంలో ఎక్కువగా బిజీగా ఉంటే, మిగతా ఇద్దరు మాత్రం హిందీలోను తమ స్టార్ స్టేటస్ కోసం ట్రై చేస్తున్నారు.
ఈ ముగ్గురికి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో .. తమిళంలోను అంతే క్రేజ్ ఉంది. ముగ్గురిలో ఎవరో ఒకరి సినిమా వస్తూ సందడి ఉండేది. కానీ ఈ సారి ముగ్గురు హీరోయిన్స్ వైపు నుంచి కూడా గ్యాప్ వచ్చేసింది. 'ఆచార్య' తరువాత పూజ హెగ్డే పూర్తిస్థాయి హీరోయిన్ గా కనిపించలేదు. ఈ ఏడాదిలో ఆమె నుంచి వచ్చే తెలుగు సినిమా కూడా లేదు. అంటే ఇక్కడ ఈ సుందరికి మూడేళ్ల గ్యాప్ రానుంది. రష్మిక విషయానికి వస్తే 'పుష్ప' తరువాత ఆమెకి ఆ స్థాయిలో పేరు తెచ్చిన సినిమాలేం లేవనే చెప్పాలి. 'సీతా రామం' హిట్ అయినప్పటికీ, అందులో రష్మిక హీరోయిన్ కాదు. ఇక 'వారసుడు' చేసినప్పటికీ, అందులో రష్మిక పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆ సినిమా వలన ఆమెకి ఒరిగింది కూడా ఏమీ లేదు. ఈ సినిమాతో చూసుకున్నా ఆమె నుంచి తెలుగు సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. అందువలన 'పుష్ప 2' వరకూ ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేయవలసిందే. ఈ సినిమా తరువాత చెప్పుకోదగిన తెలుగు ప్రాజెక్టులు కూడా ఆమె ఖాతాలో ఏమీ కనిపించడం లేదు.
ఇక కీర్తి సురేశ్ పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు. 'దసరా' సక్సెస్ తరువాత హీరోయిన్ గా ఆమె నుంచి ఇంతవరకూ తెలుగు సినిమా లేదు. ఈ ఏడాది కూడా ఆమె నుంచి వచ్చే తెలుగు సినిమాలు కనిపించడం లేదు. టాప్ త్రీ హీరోయిన్స్ గా ఉన్న ఈ ముగ్గురు భామలతో ఒక్క రష్మిక సినిమా మాత్రమే ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ గ్యాప్ లో ఈ భామలు స్థానాలు నిలుస్తాయో లేదో చూడాలి.
ఈ ముగ్గురికి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో .. తమిళంలోను అంతే క్రేజ్ ఉంది. ముగ్గురిలో ఎవరో ఒకరి సినిమా వస్తూ సందడి ఉండేది. కానీ ఈ సారి ముగ్గురు హీరోయిన్స్ వైపు నుంచి కూడా గ్యాప్ వచ్చేసింది. 'ఆచార్య' తరువాత పూజ హెగ్డే పూర్తిస్థాయి హీరోయిన్ గా కనిపించలేదు. ఈ ఏడాదిలో ఆమె నుంచి వచ్చే తెలుగు సినిమా కూడా లేదు. అంటే ఇక్కడ ఈ సుందరికి మూడేళ్ల గ్యాప్ రానుంది. రష్మిక విషయానికి వస్తే 'పుష్ప' తరువాత ఆమెకి ఆ స్థాయిలో పేరు తెచ్చిన సినిమాలేం లేవనే చెప్పాలి.
ఇక కీర్తి సురేశ్ పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు. 'దసరా' సక్సెస్ తరువాత హీరోయిన్ గా ఆమె నుంచి ఇంతవరకూ తెలుగు సినిమా లేదు. ఈ ఏడాది కూడా ఆమె నుంచి వచ్చే తెలుగు సినిమాలు కనిపించడం లేదు. టాప్ త్రీ హీరోయిన్స్ గా ఉన్న ఈ ముగ్గురు భామలతో ఒక్క రష్మిక సినిమా మాత్రమే ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ గ్యాప్ లో ఈ భామలు స్థానాలు నిలుస్తాయో లేదో చూడాలి.