భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 655 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 203 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతం వరకు పెరిగిన బజాజ్ ఫిన్ సర్వ్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలతో పాటు... బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాల్లో దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 655 పాయింట్లు లాభపడి 73,651కి ఎగబాకింది. నిఫ్టీ 203 పాయింట్లు పుంజుకుని 22,326 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.40గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (3.91%), బజాజ్ ఫైనాన్స్ (3.09%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.53%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.26%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.21%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-0.50%), రిలయన్స్ (-0.37%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.26%), టెక్ మహీంద్రా (-0.26%).