అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో ఊరట
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అచ్చెన్న ముందస్తు బెయిల్ పిటిషన్
- అచ్చెన్నపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశం
- తదుపరి విచారణ ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా
ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనల అనంతరం హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అచ్చెన్నపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది.
మరోవైపు ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఇటీవల ఈ పిటిషన్ పై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.