అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం... దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం
- అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు
- మేడమ్ టుస్సాడ్స్ లో తన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారన్న అల్లు అర్జున్
- ఇదొక మైలురాయి అంటూ అల్లు అర్జున్ హర్షం
ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా వెల్లడించారు. ఎంతో ఉద్విగ్నంగా ఉందని, మ్యూజియం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.
"మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు విగ్రహం ఆవిష్కరిస్తున్నారు. ప్రతి నటుడికి ఇదొక మైలురాయి వంటి ఘట్టం" అని అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
లండన్ లోని సిటీ సెంటర్ లో మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం కొలువై ఉంది. దీనికి సింగపూర్, దుబాయ్ లోనూ శాఖలు ఉన్నాయి.
తాజాగా, దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ విగ్రహాన్ని ఈ ఏడాది చివర్లో ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే, అందరికంటే ముందుగా ఈ విగ్రహాన్ని చూసేందుకు మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు అల్లు అర్జున్ కు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగానే తన మైనపు విగ్రహం పక్కన అల్లు అర్జున్ నిలబడి ఆ ఫొటోను సోషల్ మీడియాలో అందరికీ షేర్ చేశారు.
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహ గౌరవాన్ని పొందిన తొలి తెలుగు నటుడు, తొలి దక్షిణాది నటుడు ప్రభాస్. ఆ తర్వాత మహేశ్ బాబు వ్యాక్స్ స్టాచ్యూను కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.