ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
- నేడు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
- జిల్లా, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో 10 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
- బ్యాలెట్ పద్ధతిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉప ఎన్నిక జరుగుతోంది. జిల్లా, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఓటింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. జెడ్పీటీసీలు 83, ఎంపీటీసీలు 888, మున్సిపల్ కౌన్సిలర్లు, 449, ఎక్స్అఫిషియో సభ్యులు 19 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్‌కు 840 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉంది. కాంగ్రెస్‌కు 450 మంది బలం ఉంది. బీజేపీ, ఇతరులు కలిసి 100 మంది వరకు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు.