'గీత గోవిందం' సినిమాను గుర్తుచేస్తున్న 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్!
- 'ఫ్యామిలీ స్టార్'గా విజయ్ దేవరకొండ
- ఆయన జోడీకట్టిన మృణాల్ ఠాకూర్
- ట్రైలర్ తో పెరగనున్న అంచనాలు
- ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల
పరశురామ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా చేసిన 'ఫ్యామిలీ స్టార్' కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను వదిలారు. 'నేను నీ లైఫ్ లోకి రావడమే ప్రోబ్లమ్' వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. డ్రామా .. కామెడీ ప్రధానమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. విజయ్ దేవరకొండ నుంచి అతని తరహా బాడీ లాంగ్వేజ్ లోని కథనే ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అలాంటి కంటెంట్ కి దూరమైన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మళ్లీ దారిలో పడినట్టుగా అనిపిస్తోంది.
గతంలో పరశురామ్ - విజయ్ దేవరకొండ కలిసి 'గీత గోవిందం'తో మేజిక్ చేశారు. అలాంటి ఒక మేజిక్ మళ్లీ జరగనుందనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ కలిగిస్తోంది. టైటిల్ కి తగినట్టుగా కంటెంట్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కనుక ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.