ఓటీటీ సెంటర్ కి గోపీచంద్ 'భీమా'
- గోపీచంద్ హీరోగా చేసిన 'భీమా'
- ఈ నెల 8న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఫాంటసీ టచ్ తో సాగే మాస్ యాక్షన్ మూవీ
- ఏప్రిల్ 5 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
గోపీచంద్ కథానాయకుడిగా 'భీమా' సినిమా రూపొందింది. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకి, కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహించాడు. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి సెమీ ఫాంటసీ టచ్ ఇచ్చారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 8వ తేదీన విడుదలైంది. ఈ మధ్య కాలంలో గోపీచంద్ చేసిన వాటిలో ఫరవాలేదనిపించే సినిమా ఇది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. మాళవిక శర్మ - ప్రియా భవాని శంకర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చాడు.
గోపీచంద్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, రెండు పాత్రలు కూడా వైవిధ్యభరితంగా రాసుకున్నారు. అయితే గోపీచంద్ పోలీస్ పాత్రను కామెడీగా రాసుకోవడం .. అంతకంటే ఎక్కువ కామెడీ గోపీచంద్ చేసిన మరో పాత్రకి రాసుకున్నారు. గోపీచంద్ కి ఉన్న ఇమేజ్ కి భిన్నంగా ఈ రెండు పాత్రలని నడిపించడం ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగించింది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.