షిండే సేనకు షాకిచ్చిన బీజేపీ

  • అమరావతి ఎంపీ సీటు కోసం పట్టుబడుతున్న షిండే సేన
  • గత రెండు ఎన్నికల్లోనూ ఆ సీటును బీజేపీ తమకే వదిలేసిందన్న సేన 
  • షిండే సేన అభిమతానికి వ్యతిరేకంగా నవనీత్‌ రాణాకు సీటు కేటాయింపు
మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ సీటుకు పట్టుబడుతున్న షిండే సేనకు బీజేపీ గట్టి షాకిచ్చింది. అమరావతి సీటును నవనీత్ రాణాకు కేటాయిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. 

గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ అమరావతిని బీజేపీ తన మిత్రపక్షమైన శివసేనకు వదిలేసింది. దీంతో ఈసారి కూడా ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిని బరిలో నిలపాలని షిండే వర్గం పట్టుబట్టింది. నవనీత్‌కు అమరావతి సీటు కేటాయించడాన్ని గతవారం షిండే సేన సీనియర్ నేత మాజీ ఎంపీ ఆనంద్‌రావు వ్యతిరేకించారు. సీటు తనకే కేటాయించాలని పట్టుబట్టారు. కానీ బీజేపీ మాత్రం అమరావతి సీటును చివరకు నవ‌నీత్‌కు కేటాయించింది.

2019 ఎన్నికల్లో ఎన్సీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన నవ్‌నీత్ రాణా ఐదేళ్ల తరువాత బీజేపీలో చేరారు. మరోవైపు, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణే కూడా బడ్నేరా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఇక 2022లో అప్పటి సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతానంటూ సంచలనం సృష్టించిన నవ్‌నీత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


More Telugu News