రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ శంకుస్థాపన

  • 100 ఎకరాల్లో హైకోర్టు భవన నిర్మాణంతో పాటు జడ్జిలకు నివాస గృహాల నిర్మాణం
  • మారిన కాలంతో పాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయన్న సీజేఐ
  • సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవాలని సూచన
తెలంగాణలో నూతన హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో నూతన హైకోర్టును నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే కూడా పాల్గొన్నారు. రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో హైకోర్టు భవన నిర్మాణంతో పాటు జడ్జిలకు నివాస గృహాలను కూడా నిర్మిస్తున్నారు. 

ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ... నూతన హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతో పాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నట్లు చెప్పారు. యువత వేగంగా మార్పులను కోరుకుంటోందన్నారు. కింది కోర్టుల్లోనే కాదు... పైకోర్టుల్లో కూడా మౌలిక సౌకర్యాల కొరత ఉందన్నారు. న్యాయవ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలని సూచించారు. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవాలన్నారు.


More Telugu News