అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట

  • తన అరెస్ట్, రిమాండ్‌ను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్
  • తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
  • కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఈడీకి ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్ట్, ఈడీ రిమాండ్‌ను అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, కేజ్రీవాల్‌కు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఈడీకి ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువును ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది.

మద్యం పాలసీ కేసులో ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తాత్కాలిక బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.


More Telugu News