కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి: ఆప్ వర్గాల ఆందోళన

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్
  • రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న వైనం
  • కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ 46ఎంజీ/డీఎల్ గా నమోదైందన్న ఆప్ నేత
  • కేజ్రీవాల్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన అర్ధాంగి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని ఆప్ వర్గాలు వెల్లడించాయి. కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ మధుమేహంతో బాధపడుతున్నారని, గత కొన్ని రోజులుగా ఆయన షుగర్ లెవల్స్ లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని వివరించారు. 

ఓ దశలో కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ 46ఎంజీ/డీఎల్ గా నమోదైందని ఓ నేత తెలిపారు. బ్లడ్ షుగర్ ఈ స్థాయికి పడిపోవడం చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారని వెల్లడించారు. 

కాగా, కేజ్రీవాల్ అర్ధాంగి సునీత నిన్న జైలుకు వెళ్లి భర్తను పరామర్శించారు. కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేజ్రీవాల్ మధుమేహంతో బాధపడుతున్నారని, ఆయన షుగర్ స్థాయి అదుపు తప్పిందని వివరించారు.


More Telugu News