ఫోన్ ట్యాపింగ్‌తో సినీ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్‌మెయిల్ చేశారు: రఘునందన్ రావు
- డీజీపీని కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత
- నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరినట్లు వెల్లడి
- ఈ కేసులో నిందితులను రిమాండ్‌కు పంపించాలని విజ్ఞప్తి
ఫోన్ ట్యాపింగ్‌తో సినీ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేశారని, ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణ జరగాలని మెదక్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు డీజీపీని కోరారు. ఆయన బుధవారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... నిష్పక్షపాతంగా విచారణ జరగాలని తాము కోరినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో నిందితులను రిమాండ్‌కు పంపించాలన్నారు. ఒక్కో ఫిర్యాదుపై ఒక్కో కేసును నమోదు చేయాలని కోరారు.
ఈ కేసులో అసలు ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆరేనని ఆరోపించారు. ఏ1గా కేసీఆర్‌ను, ఏ2గా మాజీ మంత్రి హరీశ్ రావు, ఏ3గా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మిగిలిన ఆఫీసర్లను చేర్చాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి అయితే రెండో బాధితుడిని తానే అన్నారు.