పవన్ కల్యాణ్ ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
- తనయుడితో కలిసి మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చిన మాగుంట
- పవన్ తో మర్యాదపూర్వక భేటీ
- తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా పవన్ ను కలిసిన వైనం
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నేడు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం తన కుమారుడు మాగుంట రాఘవతో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పవన్ కల్యాణ్ ను కలిసి ఆయనతో పలు అంశాలపై చర్చించారు. వీరి వెంట ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు. మాగుంట ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన టీడీపీలో చేరడం తెలిసిందే.
ఇక, తిరుపతి ఎంపీ స్థానం బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ (గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే) కూడా పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తు నేపథ్యంలో సమన్వయం, ఓట్ల బదిలీ తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన వరప్రసాద్ కొన్నిరోజుల కిందటే వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.