లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 526 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 119 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- మూడున్నర శాతానికి పైగా పెరిగిన రిలయన్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 526 పాయింట్లు పెరిగి 72,996కు చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 22,123 వద్ద స్థిరపడింది. కన్జ్యూమర్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు ఒక శాతం వరకు లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (3.60%), మారుతి (2.40%), బజాజ్ ఫైనాన్స్ (1.63%), టైటాన్ (1.52%), కోటక్ బ్యాంక్ (1.14%).
టాప్ లూజర్స్:
విప్రో (-1.57%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.02%), టీసీఎస్ (-1.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.81%), నెస్లే ఇండియా (-0.79%).