రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన జీవిత విశేషాలు, చిన్ననాటి ఫొటోల చిత్రమాలిక!

  • ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు
  • 1985 మార్చ్ 27న మద్రాసులో జన్మించిన చరణ్
  • స్కూల్లో తొమ్మిదో తరగతి వరకు స్నేహితులుగా ఉన్న చరణ్, ఉపాసన
టాలీవుడ్ అగ్ర నటుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బర్త్ డే సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 1985 మార్చ్ 27న రామ్ చరణ్ అప్పటి మద్రాసు (చెన్నై)లో జన్మించారు. చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్ లో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదివారు. అనంతరం ముంబైలోని కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనలో మెళకువలు నేర్చుకున్నారు. న్యూస్ ఎక్స్ కథనం ప్రకారం చరణ్, ఆయన భార్య ఉపాసన చెన్నైలోని స్కూల్లో తొమ్మిదో తరగతి వరకు స్నేహితులుగా ఉన్నారు. 

2007లో రామ్ చరణ్ తెరంగేట్రం చేశారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'చిరుత' చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుంచి చరణ్ వెనుదిరిగి చూసుకోలేదు. సినిమా సినిమాకు తన ఇమేజ్ ను అమాంతం పెంచుకుంటూ పోయారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తనపై పడకుండా... సొంతంగా తనకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకుని... తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు. 

తన సినీ కెరీర్లో నంది, జీ సినిమా, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్, సైమా, సంతోషం ఫిల్మ్ అవార్డ్స్, ఏషియా విజన్ అవార్డ్, ఎన్డీటీవీ ట్రూ లెజెండ్, జీ సినీ అవార్డ్స్ తెలుగు, క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ వంటి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిన్ననాటి కొన్ని ఫోటోలు చూడండి. 


More Telugu News