గుజ‌రాత్ టైటాన్స్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీ జ‌రిమానా!

  • శుభ్‌మన్ గిల్‌కు రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా
  • స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగానే ఫైన్ వేసిన‌ట్లు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ప్ర‌క‌ట‌న‌
  • నిన్న‌ చెపాక్ వేదిక‌గా సీఎస్‌కే, జీటీ మ‌ధ్య‌ మ్యాచ్‌
  • 63 పరుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసిన గుజ‌రాత్‌
గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీ జ‌రిమానా ప‌డింది. మంగ‌ళ‌వారం చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) తో చెపాక్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచులో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ అత‌డికి రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. "మినిమమ్ ఓవర్ రేట్‌కు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం కావడంతో గిల్‌కి రూ. 12 లక్షల జరిమానా విధించడం జ‌రిగింది" అని ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ త‌న‌ ప్రకటనలో పేర్కొంది. 

మ‌రోవైపు నిన్న‌టి మ్యాచులో శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ తొలి ఓట‌మిని చ‌విచూసింది. రికార్డు స్థాయిలో 63 పరుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. సీఎస్‌కే విధించిన‌ 206 పరుగుల‌ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇక ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో తొలిసారి జీటీ కెప్టెన్సీ చేప‌ట్టిన శుభ్‌మ‌న్ గిల్.. ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ) తో జ‌రిగిన తొలి మ్యాచులో విజ‌యాన్ని అందించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచులో ఎంఐని గుజ‌రాత్ ఆరు ప‌రుగుల తేడాతో ఓడించింది.


More Telugu News