వేలంలో రూ. 40 కోట్లు ప‌లికిన నెల్లూరు ఆవు.. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌!

  • వ‌యాటినా-19 ఎఫ్ఐవీ మారా ఇమోవిస్ అని పిలవ‌బ‌డే నెల్లూరు జాతి ఆవుకు బ్రెజిల్‌ వేలంలో భారీ ధ‌ర‌
  • ఈ మేలుజాతి ఆవులను 1868 లోనే బ్రెజిల్‌కు త‌ర‌లించిన వైనం
  • ఆ త‌ర్వాత ఈ ర‌క‌పు జాతి ఆవులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి
  • ఒక్క బ్రెజిల్ దేశంలోనే 16 మిలియ‌న్ల వ‌ర‌కు ఈ జాతికి చెందిన ఆవులు 
  • ఈ జాతి ఆవు శాస్త్రీయ నామం బోస్ ఇండిక‌స్
మ‌న ద‌గ్గ‌ర దొరికే ఒంగోలు, నెల్లూరు మేలు ర‌కానికి చెందిన ఆవులు బాగా ప్ర‌సిద్ధి. ఈ జాతికి చెందిన ఆవుల‌కు బాగా డిమాండ్ కూడా ఉంటుంది. ఇలా మ‌న భార‌త‌దేశంలో ప్ర‌సిద్ధి చెందిన ఈ మేలుజాతి ఆవులు ఇప్పుడు ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించాయి. దీనికి కార‌ణం ఇటీవ‌ల బ్రెజిల్‌లో జ‌రిగిన ఓ వేలంలో నెల్లూరు జాతికి చెందిన ఓ ఆవు ఏకంగా రూ. 40 కోట్లు ప‌ల‌క‌డమే. 

దీంతో భార‌త‌దేశానికి చెందిన ఈ మేలుజాతి ఆవు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా మారింది. వ‌యాటినా-19 ఎఫ్ఐవీ మారా ఇమోవిస్ అని పిలవ‌బ‌డే నెల్లూరు జాతికి చెందిన ఆవు ఏకంగా 4.8 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లకు (సుమారు రూ. 40 కోట్లు) అమ్ముడుపోయింది. ఇక ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మేలుర‌క‌పు ఆవులను 1868లోనే బ్రెజిల్‌కు త‌ర‌లించ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఈ ర‌క‌పు జాతి ఆవులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందాయి. 

ఇక ఈ జాతికి చెందిన ఆవులు ఒక్క బ్రెజిల్ దేశంలోనే 16 మిలియ‌న్ల వ‌ర‌కు ఉన్న‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి. తెలుపు రంగులో ఉండి, చూడ‌టానికి బ‌లిష్టంగా క‌నిపించే ఈ మేలుర‌క‌పు ఆవులు వేడి ప్ర‌దేశాల‌లోనూ ఇమిడిపోగ‌ల‌వు. అంతేగాక వీటిలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి కూడా అధికంగానే ఉంటుంది. కాగా, ఈ జాతి ఆవు శాస్త్రీయ నామం 'బోస్ ఇండిక‌స్'.


More Telugu News