సౌదీ అరేబియా సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆ దేశ చ‌రిత్ర‌లోనే ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి!

  • తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
  • ఈ పోటీల‌కు రుమీ అల్ఖాతానీ ఎంపిక చేసిన సౌదీ అరేబియా 
  • ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తెలియ‌జేసిన బ్యూటీ
  • ఈసారి మెక్సికోలో మిస్ యూనివ‌ర్స్ పోటీలు
ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆ దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం రుమీ అల్ఖాతానీని ఈ పోటీల‌కు ఎంపిక చేసింది. ఈ మేర‌కు రుమీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఈ విష‌యాన్ని సోమ‌వారం తెలియ‌జేశారు. ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్టుకు త‌న‌కు సంబంధించిన‌ కొన్ని అంద‌మైన ఫొటోల‌ను కూడా జ‌త చేశారు. అలాగే ఈ పోస్టుకు "మిస్ యూనివ‌ర్స్ 2024 పోటీల్లో పాల్గొన‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో సౌదీ అరేబియా పాల్గొన‌డం ఇదే తొలిసారి" అని ఆమె అర‌బిక్‌లో రాశారు.  

ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ 'ఖ‌లీజ్ టైమ్స్' ప్ర‌కారం.. సౌదీ అరేబియాలోని రియాద్ న‌గ‌రానికి చెందిన రుబీ అల్ఖాతానీ ఇప్ప‌టికే ప‌లు అందాల పోటీల్లో పాల్గొన్నారు. కొన్ని వారాల క్రితం మ‌లేషియాలో జ‌రిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబ‌ల్ ఏషియ‌లోనూ ఆమె పాలుపంచుకున్నారు. 

కాగా, గ‌తేడాది మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని మిస్ నికరాగ్వా షెన్నిస్ పలాసియోస్ గెలుచుకున్న విష‌యం తెలిసిందే. ఈ అందాల పోటీల్లో మొదటి సారి నికరాగ్వా నుండి ఒక పోటీదారు విజేతగా నిల‌వ‌డం విశేషం. అలాగే థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్, ఆస్ట్రేలియాకు చెందిన మొరయా విల్సన్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఇక ఈసారి మిస్ యూనివ‌ర్స్ పోటీలు మెక్సికోలో జరగుతాయ‌ని నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. ఈ పోటీల్లోనే ఇప్పుడు సౌదీ అరేబియా తొలిసారి భాగం కానుంద‌న్న మాట‌.


More Telugu News