హుక్కాబార్‌లో దొరికిన బిగ్‌బాస్ విన్నర్, స్టాండప్ కమెడియన్ మునావర్
- ముంబైలో నిన్న సాయంత్రం ఘటన
- పొగాకులో నికోటిన్ కలిపి ఉపయోగిస్తున్నట్టు పోలీసులకు సమాచారం
- పరీక్షల్లో పాజిటివ్ రావడంతో జరిమానా
- నగదు, 9 హుక్కా పాట్స్ సీజ్
బిగ్‌బాస్ 17 విజేత, స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీని నిన్న ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుక్కాబార్‌పై దాడి సందర్భంగా పట్టుబడిన మునావర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, కేసు నమోదు చేసిన తర్వాత అతడిని విడిచిపెట్టారు. ‘కోప్టా’ 2003 చట్టం కింద అతడిపై కేసు నమోదైంది.
నిన్న సాయంత్రం హుక్కాబార్‌పై దాడిచేసిన పోలీసులు మునావర్‌తోపాటు మరో 13మందిని అదుపులోకి తీసుకున్నారు. అందరిపైనా కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. రైడ్ జరిగినప్పుడు మునావర్ హుక్కాబార్‌లోనే ఉన్నట్టు పేర్కొన్నారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో మునావర్‌కు జరిమానా విధించి, ఆ తర్వాత అతడిని విడిచిపెట్టినట్టు పేర్కొన్నారు.
హుక్కా పార్లర్‌లో పొగాకుతో కలిపి నికోటిన్ ఉపయోగిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ వెంటనే దాడిచేశారు. ఈ సందర్బంగా రూ. 4,400 నగదు, రూ. 13,500 విలువైన 9 హుక్కా పాట్స్ సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.