టీడీపీ సీనియర్ నేతలకు కీలక పదవులు అప్పగించిన చంద్రబాబు

టీడీపీ సీనియర్ నేతలకు కీలక పదవులు అప్పగించిన చంద్రబాబు
  • ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు
  • టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ నియామకం
  • రెడ్డి సుబ్రహ్మణ్యంకు పొలిట్ బ్యూరోలో చోటు
ఎన్నికల ముంగిట, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో సీనియర్ నేతలకు కీలక పదవులు అప్పగించారు. రెడ్డి సుబ్రహ్మణ్యంను పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించారు. కేఎస్ జవహర్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గండి బాబ్జీకి విశాఖ లోక్ సభ నియోజకవర్గ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. హిందూపురం లోక్ సభ నియోజకవర్గం అధ్యక్షుడిగా బీవీ వెంకటరాముడ్ని నియమించారు. ఇక, టీడీపీ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శులుగా సీఎం సురేశ్, మన్నే సుబ్బారెడ్డి, కొవ్వలి యతిరాజా, రామ్మోహన్ నాయుడు, ముదునూరి మురళీకృష్ణంరాజు, వాసురెడ్డి ఏసుదాసులను నియమించారు.


More Telugu News