కవితకు రిమాండ్ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశం

  • బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు  
  • కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
  • ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈ నాటి విచారణ సందర్భంగా ఆమె పిటిషన్ పై తీర్పును కాసేపు రిజర్వ్ లో ఉంచిన కోర్టు... కాసేపటి క్రితం తీర్పును వెలువరించింది. ఆమెకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆమెను తీహార్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. కాసేపట్లో కవితను తీహార్ జైలుకు పోలీసులు తరలించనున్నారు. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యారు. 

మరోవైపు, కవిత మధ్యనతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న పూర్తి విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, తనకు మధ్యంత బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, ఆమె విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంకోవైపు, కవితను మరో 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినప్పటికీ... ఆమెకు కోర్టు రిమాండ్ విధించడం గమనార్హం. రిమాండ్ లో ఉన్న కవితను ఈడీ తమ కస్టడీకి కోరే అవకాశం ఉంది.


More Telugu News