పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి ఎన్నికలకు దూరంగా ఉన్న కేసీఆర్ కుటుంబం!
- 23 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్
- అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో బరిలోకి దిగిన కేసీఆర్ ఫ్యామిలీ
- ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగని కేసీఆర్ కుటుంబ సభ్యులు
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. 23 ఏళ్ల క్రితం కొందరు నేతలతో కలిసి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికలో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తూనే ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితల్లో ఎవరో ఒకరు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, ఈ సారి మాత్రం వారి కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో కేటీఆర్ లేదా హరీశ్ రావు పోటీ చేయవచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ, వీరిద్దరిలో ఎవరూ బరిలోకి దిగలేదు. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.