'ఆహా' తెరపైకి 'సుందరం మాస్టర్'
- హర్ష హీరోగా రూపొందిన 'సుందరం మాస్టర్'
- క్రితం నెలలో థియేటర్లకు వచ్చిన సినిమా
- కామెడీ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కంటెంట్
- ఈ నెల 28 నుంచి జరగనున్న స్ట్రీమింగ్
హర్ష చెముడు తొలిసారిగా కథానాయకుడిగా చేసిన సినిమాగా 'సుందరం మాస్టర్' రూపొందింది. రవితేజ - సుధీర్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 23వ తేదీన ఇక్కడి థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో కాకపోయినా, కొంతవరకూ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ద్వారా ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దివ్యశ్రీపాద - హర్షవర్ధన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులోని కొన్ని ఎపిసోడ్స్ హాస్యభరితంగా మంచి మార్కులు తెచ్చుకున్నాయి.
సుందరరావు అనే టీచర్ ఆంగ్లాన్ని బోధించడానికి ఒక ఫారెస్ట్ ప్రాంతంలోని గిరిజన గూడెంకు వెళతాడు. తాను ఆ ప్రాంతానికి ఎందుకు పంపించబడ్డాననే విషయం అక్కడికి వెళ్లిన తరువాత అతనికి అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? పరిణామాలు ఎలా ఉంటాయి? అనేది కథ. ఈ తరహా కంటెంట్ కి ఓటీటీ వైపు నుంచి మంచి ఆదరణ లభించే అవకాశం ఉందనే చెప్పాలి.