పురందేశ్వరిని కలిసిన మంద కృష్ణ మాదిగ
- విజయవాడలో పురందేశ్వరిని కలిసిన మంద కృష్ణ మాదిగ
- 35 డిమాండ్లతో కూడిన మెమోరాండంను అందించిన మంద కృష్ణ
- ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్న పురందేశ్వరి
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పురందేశ్వరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 35 డిమాండ్లతో కూడిన మెమోరాండంను పురందేశ్వరికి అందించారు. ఈ డిమాండ్లలో ఎస్సీ వర్గీకరణ కూడా ఉంది. ఎస్సీల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంద కృష్ణకు పురందేశ్వరి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కూడా కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీలో ఎన్డీయేకు పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా పురందేశ్వరికి మంద కృష్ణ హామీ ఇచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.