కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఆరో జాబితా విడుదల
- ఈ జాబితాలో ఐదుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
- తమిళనాడు, రాజస్థాన్‌లకు చెందిన ఎంపీ అభ్యర్థుల పేర్ల ప్రకటన
- ఇప్పటివరకు ఆరు జాబితాలలో మొత్తం 190 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
- తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 9 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థుల ఆరో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఇందులో తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పటివరకు విడుదల చేసిన ఆరు జాబితాలలో కలిపి కాంగ్రెస్ మొత్తం 190 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను తొమ్మిది స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కాగా, మార్చి 27న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణలోని మిగతా 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.